రూ.6.29 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజి ప్రకటించిన కేంద్రప్రభుత్వం

June 29, 2021


img

కరోనా మొదటి, రెండో దశలలో దేశవ్యాప్తంగా అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా సామాన్యప్రజల జీవితాలు తలక్రిందులైపోయాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం రూ.6.29 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. దీనిలో వివిద రంగాలకు చేసిన కేటాయింపులు ఈవిదంగా ఉన్నాయి...

• థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు రూ.15,000 కోట్లు 

• ప్రజారోగ్యంలో వైద్య సదుపాయాలు కల్పనకు రూ.23,000 కోట్లు 

• గరీబ్ కళ్యాణ్ యోజన పధకంలో భాగంగా దేశవ్యాప్తంగా పేదలకు నెలకు 5 కేజీల చొప్పున మరో 3 నెలలపాటు ఉచితంగా బియ్యం పంపిణీ

•  పోషకాహార పంటలకు వాడే ఎరువులపై రూ. 42,000 కోట్లు సబ్సీడీ

• కరోనాతో నష్టపోయిన వైద్యేతర రంగాలకు రూ.60,000 కోట్ల రుణాలకు కేంద్రప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. 

• విద్యుత్ సరఫరా వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు కేంద్రప్రభుత్వం వాటాగా రూ.97,631 కోట్లు ఇస్తుంది. కేంద్రం సూచించిన సంస్కరణలను అమలుచేస్తున్న రాష్ట్రాలకు ఆ ప్రతిపదికన రూ.1,05,864 కోట్లు రుణాలు తీసుకొనేందుకు అనుమతిస్తుంది. 

• నెలకు రూ.15,000 లోపు జీతం పొందుతున్న ఉద్యోగులకు వారి వాటా (12%) యాజమాన్యం వాటా (12%) కలిపి మొత్తం 24 శాతం తీసుకొనేందుకు ఇచ్చిన గడువును మార్చి 2022 వరకు పొడిగించింది. 

• దేశంలో పర్యాటక ఆదాయాన్ని పెంపొందించేందుకు భారత్‌ పర్యటనకు వచ్చే తొలి 5 లక్షల మంది విదేశీ పర్యాటకులకు ఉచితంగా వీసాలు ఇవ్వబడతాయి. ఈ పధకం మార్చి 2022 వరకు లేదా 5 లక్షల పర్యాటకులు పూర్తయ్యేవరకు కొనసాగించబడుతుంది. 

• ట్రావెల్ ఏజన్సీ సంస్థలకు రూ.10 లక్షలు, టూరిస్ట్ గైడ్‌లకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు రుణాలు మంజూరు చేయబడతాయి.


Related Post