కరోనా చికిత్సకు ఛార్జీల ప్రకటన…కానీ ఏం ప్రయోజనం?

June 23, 2021


img

రాష్ట్రంలో కరోనా పరీక్షలు, చికిత్సలకు సంబందించి ఛార్జీలను నిర్ణయిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుదవారం జీవోను విడుదల చేసింది. ఆ వివరాలు: 

• సాధారణ వార్డులో ఐసోలేషన్ పరీక్షలకు రోజుకు గరిష్టంగా రూ.4,000 మాత్రమే. 

• ఐసీయులో వెంటిలేటర్‌పై చికిత్సకు రోజుకు రూ.9,000 మాత్రమే. 

• హెచ్ఆర్‌టీసీ: రూ.1,995.00 

• డిజిట‌ల్ ఎక్స్‌రే: రూ.1,300.00 

• ఐఎల్ 6: రూ.1,300. 00

• డీ డైమ‌ర్ ప‌రీక్ష: రూ.300.00  

• సీఆర్‌పీ: రూ.500.00 

• ప్రొకాల్ సీతోసిన్: రూ.1,400.00

• ఫెరిటిన్: రూ.400.00 

• ఎల్ డీహెచ్: రూ.140.00 

• సాధార‌ణ అంబులెన్స్‌కు క‌నీస ఛార్జి రూ.2,000 (కిలోమీట‌ర్‌కు రూ. 75/-)

• ఆక్సిజ‌న్ అంబులెన్స్‌కు క‌నీస ఛార్జి రూ. 3, 000 (కిలోమీట‌ర్‌కు రూ. 125/-)

• పీపీఈ కిట్ ధ‌ర రూ. 273.00 

బహుశః హైకోర్టు ఒత్తిడి, ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో విడుదల చేసి ఉండవచ్చు. అయితే ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలను ప్రైవేట్‌ ఆసుపత్రులు పట్టించుకొనే స్థితిలో లేవనే సంగతి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రొగులు, వారి బందువులకు బాగా తెలుసు. కనుక ప్రభుత్వం ఈ జీవోను ప్రైవేట్‌ ఆసుపత్రుల చేత అమలు చేయించగలిగితేనే ఏమైనా ప్రయోజనం లేకుంటే హైకోర్టు కోసం కంటి తుడుపు చర్యగా జారీ చేసినట్లవుతుంది.


Related Post