ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ హైలైట్స్

May 20, 2021


img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం నేడు 2021-2022 ఆర్ధిక సంవత్సరాలకుగాను రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో, హోంమంత్రి మేకతోటి సుచరిత శాసనమండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 

ఏపీ వార్షిక బడ్జెట్‌ అంచనాల విలువ రూ.2,29,779.27 కోట్లు. దీనిలో 50 శాతానికి పైగా సంక్షేమ పధకాలకే కేటాయించడం విశేషం. రెవెన్యూ వ్యయం రూ.1,82,196.54 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.47,582.73 కోట్లు. రెవెన్యూ లోటు రూ.5,000.05 కోట్లుకాగా ద్రవ్య లోటు రూ.37,029.79 కోట్లు. 

ఏపీలో కొత్తగా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు రావడం లేదు. లాక్‌డౌన్‌ కారణంగా ఉన్నవి కూడా మూసుకుపోయాయి. కనుక రాష్ట్ర ఆదాయం ఏవిదంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ ఈ పరిస్థితులలో కూడా ఏపీ ప్రభుత్వం ఇంత భారీ బడ్జెట్‌ ప్రకటించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి బడ్జెట్‌ కేటాయింపులకు...ముఖ్యంగా జగనన్న పేరిట ప్రారంభించిన డజన్ల కొద్దీ సంక్షేమ పధకాలకు అవసరమైన డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు.

సాధారణంగా ఏ రాష్ట్రలోనైనా ప్రజలు ప్రభుత్వం ఏమి వరాలు ప్రకటిస్తుందా అని ఆశగా ఎదురుచూస్తుంటారు. కానీ ఏపీలో ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులున్నాయి. రాష్ట్ర ఆదాయంతో సంబందం లేదన్నట్లు జగనన్న ప్రభుత్వం గత రెండేళ్ళుగా నిత్యం ప్రజలపై వరాల జడివాన కురిపిస్తూనే ఉంటుంది. ఎంతైనా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చాలా అదృష్టవంతులు. 


Related Post