భారత్‌లో కరోనా అదుపు తప్పిందా?

April 08, 2021


img

గత ఏడాది భారత్‌లో మొదటిసారిగా కరోనా మహమ్మారి ప్రవేశించినప్పుడు, దేశంలో కోట్లాదిమంది కరోనాబారిన పడి మరణిస్తారని, దాంతో దేశంలో శవాలగుట్టలు పేరుకుపోతాయని అగ్రదేశాలు జోస్యం చెప్పాయి. కానీ అప్పుడు భారత్‌లో అటువంటి పరిస్థితులు ఏర్పడలేదు కానీ ఆ అగ్రదేశాలలోనే జోస్య ప్రభావం కనిపిచింది. భారత్‌లో కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చి... దాని తీరుతెన్నులు, దానిని నివారణ విదానాలపై పూర్తిగా అవగాహన ఏర్పడి...కరోనా నివారణకు అవసరమైన ఆసుపత్రులు, మంచి మందులు, టీకాలు అన్నీ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇప్పుడు కరోనా అదుపు తప్పుతుండటం చాలా ఆందోళనకలిగిస్తోంది. 

 గత ఏడాది కరోనాకు సరైన మందులు, దాని గురించి అవగాహన లేనప్పుడు గరిష్టంగా రోజుకి 95,000 పాజిటివ్ కేసులు నమోదు కాగా, గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 1,15,736 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 630 మంది చనిపోయారు. ఈ లెక్కలు చూస్తే భారత్‌లో కరోనా అదుపు తప్పిందా? లేక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడిలో అలసత్వం ప్రదర్శిస్తున్నాయా? అనే అనుమానం కలుగకమానదు. 

ప్రస్తుతం నమోదవుతున్న కొత్త కేసులలో అత్యధికంగా మహారాష్ట్రలో ఆ తరువాత పంజాబ్, ఛత్తీస్‌ఘడ్‌, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌, కేరళలో కేసులు నమోదైనట్లు కేంద్ర రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో కరోనా కట్టడికి మళ్ళీ లాక్‌డౌన్‌ విధించక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 

రాష్ట్రం

కొత్త కేసులు

మరణాలు

మొత్తం కేసులు

మొత్తం మరణాలు

మహారాష్ట్ర

55,469

297

31,13,354

56,330

తెలంగాణ

1,914

5

3,16,649

1,734

ఆంధ్రప్రదేశ్‌

2,331

11

9,13,274

7,262


Related Post