ఏ నమ్మకంతో చేరుతున్నారో?

April 06, 2021


img

సమైక్య రాష్ట్రంలో పదేళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ వంటి జాతీయపార్టీ రాష్ట్రంలో టిఆర్ఎస్‌ ధాటిని తట్టుకోలేక మనుగడ కోసం పోరాడుతుండగా, అసలు ఉనికేలేని పార్టీలో నేతలు చేరుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అదే తెలంగాణ వైసీపీ...దాని దన్నుతో ముందుకు సాగుతున్న వైఎస్ షర్మిళ. రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశిస్తున్న ఆమెకు తెలంగాణలో అనూహ్య స్పందన లభిస్తోంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో వైఎస్ అభిమానులు ఆమెను కలవడానికి క్యూ కడుతున్నారు. ఊహించినట్లే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒకరొకరుగా షర్మిళ పంచన చేరుతున్నారు.

తాజాగా హైదరాబాద్‌ నగర్‌లోని మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అచ్యుతా యాదవ్ సోమవారం లోటస్ పాండ్‌కు వెళ్ళి షర్మిళలను కలిసి వచ్చారు. తరువాత తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి షర్మిళ పెట్టబోయే పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటిచారు. ఆమెతో పాటు మంధని, మక్తల్ ప్రాంతాలకు చెందిన పలువురు ద్వితీయశ్రేణి రాజకీయ నేతలు షర్మిళను కలిసి ఆమె నాయకత్వంలో పనిచేసేందుకు సంసిద్దత వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రంలో వామపక్షాలు, కాంగ్రెస్, టిజేఎస్‌, ఇంటి పార్టీ వగైరాలనే ప్రజలు పట్టించుకోనప్పుడు ఏ నమ్మకంతో షర్మిళతో చేతులు కలిపేందుకు నేతలు క్యూ కడుతున్నారో తెలీదు. 


Related Post