గణతంత్ర దినోత్సవవేడుకలలో బంగ్లాదేశ్ త్రివిద దళాలు పెరేడ్!

January 23, 2021


img

ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో జరుగబోయే పరేడ్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన త్రివిద దళాలు కూడా పాల్గోనున్నాయి. భారత్‌ సాయంతో 1971లో పాకిస్థాన్‌ నుంచి బంగ్లాదేశ్ విముక్తి పొంది స్వతంత్ర దేశంగా అవతరించింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొంది 50 సం.లు పూర్తయిన సందర్భంగా బంగ్లాదేశ్ త్రివిద దళాలు ఢిల్లీలో జరుగబోయే పరేడ్‌లో పాల్గొనబోతున్నాయని ఆ దేశ త్రివిదదళాల చీఫ్ మోహత్సిమ్ హైదర్ చౌదరి తెలిపారు. బంగ్లా బృందంలో మొదటి ఆరు వరుసలలో ఆర్మీ (సైనికులు), తరువాత వరుసలో నావికాదళం, మూడో వరుసలో వైమానిక దళానికి చెందిన బృందం పాల్గొంటుందని తెలిపారు. భారత్‌ గణతంత్ర దినోత్సవవేడుకలలో పాల్గొనే అవకాశం చాలా అరుదైన గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. 

        Related Post