ప్రపంచానికి చైనా కరోనా అంటిస్తే...భారత్‌...

January 21, 2021


img

దూర్తదేశాలుగా ముద్రపడిన చైనా, పాకిస్థాన్‌లకు కొన్ని విషయాలలో సారూప్యత ఉంటుంది. పాక్‌ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుంటే, చైనా చవుకగా తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ ప్రపంచదేశాలలోని పరిశ్రమలను, వ్యాపారాలను కబళించివేస్తుంటుంది. తద్వారా ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంటుంది. చైనా బహిరంగగానే ఇరుగుపొరుగు దేశాలపై దురాక్రమణలకు పాల్పడుతుంటే, పాకిస్థాన్‌ జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, వేర్పాటువాదులను ప్రోత్సహిస్తూ కశ్మీర్‌ను కబళించాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు పాకిస్థాన్‌లో కనబడుతుంటాయి. చైనా, పాకిస్థాన్‌ రెండూ కూడా భారత్‌ సరిహద్దులలో సమస్యలు సృష్టిస్తూ సవాళ్ళు విసురుతూనే ఉంటాయి. 

చైనా అంటించిన కరోనా వైరస్‌తో గత ఏడాది మొత్తం యావత్ ప్రపంచదేశాలు ఎంతగా అల్లాడిపోయాయో అందరూ చూశారు. ప్రపంచదేశాలకు చైనా కరోనాను వ్యాపింపజేస్తే భారత్‌ దాని నివారణకు వ్యాక్సిన్లను తయారుచేసి భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక వంటి ఇరుగుపొరుగు దేశాలకు అందజేస్తోంది. త్వరలోనే ఆఫ్రికాలోని నిరుపేద దేశాలకు కూడా భారత్‌ కరోనా వాక్సిన్లను సరఫరా చేయబోతోంది. ఇంకా అనేక ఇతర దేశాలకు కూడా భారత్‌ కరోనా వాక్సిన్లను సరఫరా చేయబోతోంది. 

ఇరుగుపొరుగు దేశాలను కబళించాలని, వాటికి సమస్యలు సృష్టించాలని చైనా, పాకిస్థాన్‌లు కుట్రలు పన్నుతుంటే ఇరుగుపొరుగుదేశాల అభివృద్ధికి భారత్‌ యధాశక్తిన తోడ్పడుతుంటుంది. తాలిబన్ల కారణంగా విధ్వంసమైన ఆఫ్ఘనిస్తాన్ దేశ పునర్నిర్మాణంలో భారత్‌ పాల్గొనడమే అందుకు నిదర్శనం. అలాగే ఇప్పుడు కరోనాతో అల్లాడిపోతున్న ఇరుగుపొరుగు దేశాలకు వాక్సిన్లను సరఫరా చేస్తూ కష్టకాలంలో పెద్దన్నలా నిలబడి చేయూతనిచ్చి ఆదుకొంటుంది. చైనా, పాకిస్థాన్‌లు ఎల్లప్పుడూ దుర్బుద్దితో వ్యవహరిస్తుంటే, భారత్‌ విశ్వమానవాళి శ్రేయస్సును కోరుకొంటుంది. ఇదే...భారత్‌కు, చైనా, పాకిస్థాన్‌లకు ఉన్న తేడా.


Related Post