మరో మూడేళ్ళు కేసీఆరే ముఖ్యమంత్రి: బండి సంజయ్‌

January 05, 2021


img

మంత్రి కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయనో లేదా మరో ముప్పై ఏళ్ళు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని టిఆర్ఎస్‌ వాళ్ళు అంటే ఆశ్చర్యం కాదు. కానీ కేసీఆర్‌, కేటీఆర్‌లపై నిత్యం విమర్శలు, ఆరోపణలు గుప్పించే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆ మాట అంటే అది చాలా విచిత్రమే. ఈరోజు వరంగల్‌ పర్యటనకు వచ్చిన బండి సంజయ్‌ జనగామలో మీడియాతో మాట్లాడుతూ, “మరో మూడేళ్ళపాటు కేసీఆరే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టరు. కేసీఆర్‌కు అటువంటి ఆలోచన కూడా లేదు. ఎందుకంటే మూడేళ్ళ తరువాత జరుగబోయే శాసనసభ ఎన్నికలలో బిజెపి చేతిలో టిఆర్ఎస్‌ ఓడిపోయి తాను ముఖ్యమంత్రి పదవి కోల్పోతానని ఆయనకు తెలుసు...”అంటూ రాష్ట్రంలో బిజెపి టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఏవిధంగా ఎదుగుతోందో బండి సంజయ్‌ వివరించారు. 

ఒకవేళ నిజంగా అటువంటి పరిస్థితులే వస్తాయని సిఎం కేసీఆర్‌ భావించినట్లయితే వీలైనంత త్వరలోనే కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తారే తప్ప చేతులు కాలాక ఆకులు పట్టుకోవాలనుకోరు కదా? 


Related Post