ఆ విషాదానికి 16 ఏళ్ళు...

December 26, 2020


img

చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు ఈరోజు (డిసెంబర్ 26). సరిగ్గా 16 సంవత్సరాల క్రితం అంటే..2004లో ఇదే రోజు సునామి విరుచుకుపడటంతో భారత్‌తో సహా 15 దేశాలు గజగజలాడాయి. హిందూ మహాసముద్రంలోని భారత్‌ మరియు బర్మా పరిధిలోని సముద్రగర్భంలోని పలకలలో జరిగిన భారీ కదలికల కారణంగా ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో భూకంపం సంభవించింది. సముద్రంలో వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 9.3గా నమోదయ్యింది. అంత తీవ్రతతో సముద్రగర్భంలో భూకంపం ఏర్పడటంతో చాలా భారీ సునామి సంభవించింది. దాంతో సుమారు 2.28 లక్షలమంది మృత్యువాత పడ్డారు....సుమారు 43,000 మంది కనబడకుండా పోయారు. సుమారు 17.40 లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఒక్క భారత్‌లోనే సుమారు 16, 269 మంది చనిపోగా,  సుమారు 6.50 లక్షల మంది నిరాశ్రులయ్యారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్‌పై అమెరికా ప్రయోగించిన రెండు అణు బాంబుల కంటే ఈ సునామీ తీవ్రమైనదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏది ఏమైనప్పటికీ డిసెంబరు 26 మానవజాతి చరిత్రలో ఒక విషాదమైన రోజుగా ఎప్పటికీ మిగిలిపోతుంది.




Related Post