కొత్త రూపంలో కరోనా మహమ్మారి... బ్రిటన్‌లో విజృంభణ

December 21, 2020


img

ఈ ఏడాది మొత్తం యావత్ ప్రపంచదేశాలు కరోనాతో అల్లాడిపోయాయి. శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడి ఎట్టకేలకు కరోనా సోకకుండా ఉండేందుకు టీకాలు తయారు చేశారు. త్వరలోనే అవి అందుబాటులోకి వస్తున్నాయి కనుక 2021లో కరోనా నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుందని అందరూ ఆశగా ఎదురుచూస్తుంటే, బ్రిటన్‌లో కరోనా మహమ్మారి మరో కొత్త రూపంలో విజృంభిస్తోంది. 

కొత్తరూపంలో విజృంబిస్తుస్తున్న కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోందని దానినిఅదుపు చేసేందుకు అన్నివిధాల ప్రయత్నిస్తున్నామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. ఈ కొత్త వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్యసంస్థను కూడా అప్రమత్తం చేశామని తెలిపారు. కొత్తరూపంలో విజృంభిస్తున్న ఈ వైరస్ కరోనా కంటే ప్రమాదకరమైనదా...కాదా అనే విషయం ఇంకా తెలుసుకోవలసి ఉందని అన్నారు. కొత్త రూపంలో వైరస్ విజృంబిస్తుండటంతో దేశంలో అత్యవసరం కానీ సినిమాహాల్స్, వ్యాయామశాలలు, పార్కులు వంటివన్నిటినీ రెండువారాల పాటు మూసివేయాలని నిర్ణయించినట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. అవసరమైతే దేశంలో మళ్ళీ లాక్‌డౌన్‌ విధించేందుకు వెనుకాడబోమని తెలిపారు. 

బ్రిటన్‌ ప్రకటనతో అప్రమత్తమైన ఐరోపా దేశాలు ఆ దేశం నుంచి అంతర్జాతీయ విమాన, రైల్వే సేవలపై ఆంక్షలు విధించడం ప్రారంభించాయి. భారత ప్రభుత్వం కూడా ఈ కొత్త వైరస్‌పై అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆదేశం మేరకు ఆరోగ్యసేవల డైరెక్టర్ జనరల్ అధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో సంయుక్త పర్యవేక్షణ బృందం అత్యవసర సమావేశం జరుగనుంది. ఈ కొత్త రకం వైరస్‌ వ్యాప్తి చెందేవిధానం, ప్రభావం, తీవ్రత, దాని నివారణకు తీసుకోవలసిన చర్యలు తదితర అంశాల గురించి నేటి సమావేశంలో చర్చించనున్నారు. 

భారత్‌ త్వరలో అందుబాటులోకి రాబోయే వ్యాక్సిన్లు కరోనా అడ్డుకోగలవు. కానీ ఈ కొత్త రకం వైరస్‌ను అడ్డుకోగలిగితే అదృష్టమే లేకుంటే కరోనా కధ మళ్ళీ మొదటికొచ్చినట్లే!


Related Post