ఈ ఏడాది డిసెంబర్‌లోగా హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న 85,000 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు లబ్దిదారులకు అందజేస్తామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాపనుల పురోగతిపై మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులు, గ్రేటర్ పరిధిలోని 4 జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దేశంలో మరే మెట్రో నగరంలోలేని విధంగా రూ.9,700 కోట్లు వ్యయంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో 75,000 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు, జేఎన్‌యూఆర్‌ఎం, వాంబే పథకంలో భాగంగా మరో 10,000 ఇళ్ళు నిర్మిస్తున్నాము. గ్రేటర్ పరిధిలో ఉండే 24 శాసనసభ నియోజకవర్గాలలో ఒక్కో నియోజకవర్గంలో 4,000 ఇళ్ళు ఉండేలా నిర్మిస్తున్నాము. తద్వారా అన్ని ప్రాంతాలలో పేదలకు ఇళ్ళు సమకూర్చినట్లవుతుంది. డిసెంబర్‌లోగా ఇళ్ళ నిర్మాణపనులు పూర్తవుతాయి. కనుక ఒకటి రెండు రోజులలోగానే లబ్దిదారుల ఎంపికకు లోపుగానే లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించేందుకు వీలుగా మార్గదర్శకాలను జారీ చేస్తాము,” అని చెప్పారు.