అగ్నిప్రమాదంపై రేవంత్‌ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు

August 21, 2020


img

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో నిన్న రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు అధికారులు చనిపోగా మిగిలిన నలుగురి  కోసం సహాయబృందాలు లోపల వెతుకుతున్నాయి. ఇటువంటి సమయంలో కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ఈ అగ్నిప్రమాదంపై కూడా రాజకీయాలు చేయడం చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఇటువంటి సమయంలో బాధిత కుటుంబాలను ఊరడించి ధైర్యం చెప్పడం కనీస మానవధర్మం కానీ ఆయన "ఇది నిజంగా అగ్నిప్రమాదమా...లేక దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా?" అని అనుమానాలు వ్యక్తం చేయడం చాలా దారుణం.  

“ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డితో కుమ్మకైనా సిఎం కేసీఆర్‌, రాష్ట్రంలో జల విద్యుత్ ప్రాజెక్టులను భ్రష్టు పట్టించేందుకు కుట్ర చేస్తున్నారని నేను చాలా కాలం క్రితమే చెప్పాను. ఇప్పుడు శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరుగడంతో ఆ అనుమానం బలపడుతోంది. బహుశః అగ్నిప్రమాదం పేరుతో ఆ కుట్రను కప్పి పుచ్చుకోవాలనే ప్రయత్నం జరిగిందేమో? ఈ ప్రమాదంలో నిజానిజాలు తెలుసుకొనేందుకు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాను,” అని రేవంత్‌ రెడ్డి అన్నారు. 


Related Post