సచివాలయం కూల్చివేతను చూతం రారండి...

July 27, 2020


img

తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులను చిత్రీకరించడానికి మీడియాను అనుమతించాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలవడంతో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కూల్చివేత పనులను మీడియా చిత్రీకరించడానికి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు బీఆర్‌కె భవన్‌ నుంచి మీడియా ప్రతినిధులను ప్రత్యేక బస్సులో అక్కడకు తీసుకువెళ్ళనున్నారు. నగర పోలీస్ కమీషనర్ సజ్జనార్ స్వయంగావారిని అక్కడకు తీసుకువెళ్లి చూపిస్తారు. ఆ ప్రదేశంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కనుక అన్ని జాగ్రత్తలు తీసుకొన్నాక మీడియా ప్రతినిధులను అక్కడకు తీసుకువెళుతున్నామని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. 

ఎవరైనా ఇల్లు కార్యాలయం కట్టుకొన్నప్పుడు బందుమిత్రులు అందరినీ ఆహ్వానించి తమ ఇల్లు, కార్యాలయాన్ని వారికి చూపించి వారు మెప్పుపొందాలనుకొంటారు. కానీ సచివాలయాన్ని ఎలా కూల్చుకొంటున్నామో తెలంగాణ ప్రభుత్వం చూపించవలసి వస్తోంది!



Related Post