ముఖ్యమంత్రి కులాసాయేనా? పిటిషన్‌ దాఖలు

July 10, 2020


img

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదిరోజులుగా గజ్వేల్లో ఉండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం అవుతుండటం సహజం. ఆయన గురించి యావత్ రాష్ట్ర ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారని కనుక ఆయన ఆరోగ్యపరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తూ ప్రభుత్వం చేత ఒక అధికారిక ప్రకటన చేయించాలని కోరుతూ హైకోర్టులో నవీన్ (తీన్మార్ మల్లన్న) ఓ పిటిషన్‌ వేశారు. దానిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలక్షేపం కోసమో లేదా గుర్తింపు కోసమో ఇటువంటి చవుకబారు జిమ్మికులు చేస్తే ఊరుకోబోమని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ఇటువంటి పిటిషన్లను అత్యవసరంగా విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కనబడటం లేదని భావిస్తే హెబియస్ కార్ప్ పిటిషన్‌ దాఖలు చేయాలని సూచించింది.        



Related Post