అభివృద్ధిపదంలో దూసుకుపోతున్న తెలంగాణ

June 24, 2020


img

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక మునుపటి పరిస్థితులతో ప్రస్తుత పరిస్థితులను పోల్చి చూసుకొంటే ఈ ఆరేళ్ళ స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రంలో అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి జరిగినట్లు స్పష్టంగా కనబడుతుంది. అందుకు ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్రం... ప్రజల పట్ల సిఎం కేసీఆర్‌కున్న తపన, చిత్తశుద్ది, పట్టుదల, దూరదృష్టి అని చెప్పక తప్పదు. బంగారి తెలంగాణ లక్ష్యంగా ఆయన నాయకత్వంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేస్తుండటంతో అతి తక్కువ కాలంలోనే ఆ లక్ష్యాన్ని సాధించగలిగారు. దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా పోటీ పడుతోంది.

తెలంగాణ ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో ఐ‌టి, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ఆ శాఖల మంత్రి కేటీఆర్‌ విశేషంగా కృషి చేశారు. ఆయన కృషి, పట్టుదల కారణంగా రాష్ట్రంలో కొత్తగా మెడికల్ హబ్, చిన్న పరిశ్రమల కోసం ఇండస్ట్రియల్ పార్క్‌, టీ-హబ్‌, టెక్స్‌టైల్‌ పార్కు వంటివెన్నో ఏర్పాటయ్యాయి. ఇంకా అవుతున్నాయి కూడా. 2019-2020లో రాష్ట్ర పారిశ్రామిక రంగం యొక్క వార్షికనివేదికను మంత్రి కేటీఆర్‌ నిన్న ప్రగతి భవన్‌లో విడుదల చేశారు. ఆ వివరాలు క్లుప్తంగా...

1.     స్థూల జాతీయోత్పత్తి సగటుతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో 8.2 శాతం వార్షిక అభివృద్ధి సాధించింది.

2.    జాతీయ జీడీపీలో 2018-19లో తెలంగాణ వాటా 4.55 శాతం. 2019-2020లో అది 4.76 శాతానికి పెరిగింది.

3.    జాతీయ తలసరి ఆదాయం సగటు రూ.1,34,432 కాగా తెలంగాణ తలసరి ఆదాయం సగటు రూ.2,28,216.

4.    2018-19లో దేశ ఎగుమతులలో తెలంగాణ వాటా 10.61 శాతం కాగా 2019-2020లో అది 11.58 శాతానికి పెరిగింది.

5.    జాతీయ ఫార్మా ఉత్పత్తులలో తెలంగాణ వాటా 35 శాతం.

6.    టిఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటివరకు తెలంగాణకు రూ. 1,96,404 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

7.    తెలంగాణలో మొత్తం 10,021 పరిశ్రమల స్థాపనకు ముందుకు రాగా వాటిలో 75 శాతం ఉత్పత్తి ప్రారంభించాయి. మిగిలినవి వివిద దశలలో ఉన్నాయి.

8.    ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.

9.    దేశంలో జీవించేందుకు అత్యంత అనుకూలమైన నగరంగా హైదరాబాద్‌ ఎన్నికైంది.

     పరిశ్రమల శాఖ సాధించిన విజయాలు:

1.     హైదరాబాద్‌ శివార్లలో జీనోమ్ వ్యాలీ విస్తరణ. దానిలో కొత్తగా టిసీఐ కెమికల్స్, వల్కర్ ఫార్మా, సింజిన్, యాపన్ బయో, శాండజ్‌ తదితర 200 కంపెనీలలో 10,000 మందికి ఉద్యోగాలు లభించాయి.

2.    హైదరాబాద్‌ సమీపంలో 250 ఎకరాలలో ఏర్పాటు చేసిన వైద్య పరికరాల తయారీ పార్కులో 25 కంపెనీలు ఉత్పత్తి ప్రారంభం.

3.    హైదరాబాద్‌ మెడికల్ పార్కుకు నీమ్జ్ హోదా. త్వరలో శంఖుస్థాపన.

4.    అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన నోవార్టీస్ త్వరలో హైదరాబాద్‌లో డిజిటల్ ఆవిష్కరణ కేంద్రం ప్రారంభించబోతోంది.   

5.     తెలంగాణ రాష్ట్రంలో 800 ఫార్మా, బయోటెక్ తదితర పరిశ్రమల విలువ రూ. 50 బిలియన్ డాలర్లు. 

6.    హైదరాబాద్‌లో స్థాపించిన నోవా ఇంటిగ్రేటడ్ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ ద్వారా 600 మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించాయి.

    మెగా ఫుడ్ పార్క్‌ ఏర్పాటు.

8.    రెడీమేడ్ దుస్తుల తయారీ సంస్థల కోసం సిరిసిల్లాలో 60 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్‌ ఏర్పాటు. దానికి సమీపంలోనే వీవింగ్ (నేత)పార్క్‌ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. 

9.    రూ.60 కోట్లతో 300 ఎకరాల విస్తీర్ణంలో వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటవుతోంది.

10.  హైదరాబాద్‌ గచ్చిబౌలీలో 20,000 చ.అడుగుల విస్తీర్ణంలో అమెజాన్ కేంద్రం ఏర్పాటు.

11.   దేశంలో ఏకైక అతిపెద్ద ఫర్నీచర్ మాల్‌ ఐకియా హైదరాబాద్‌లో ఏర్పాటు.

12.  అంతర్జాతీయ సంస్థ వాల్ మార్ట్ రాష్ట్రంలో 5వ బ్రాంచిని వరంగల్‌లో ప్రారంభించింది.

13.  త్వరలో రాష్ట్రానికి మరో 45,848 కోట్లు పెట్టుబడులు వాటి ద్వారా రాష్ట్రంలో 83,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కలుగుతాయి.   

లక్ష్యాలు:

1.     రాష్ట్రంలో ఫార్మా పెట్టుబడులు 100 బిలియన్ డాలర్లకు పెంచడం.

2.    4 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాది అవకాశాలు కల్పించడం.   


Related Post