భారత్‌లో కరోనాకు మందు వచ్చేసింది

June 22, 2020


img

కరోనా నివారణకు మందు భారత్‌లో మార్కెట్లోకి వచ్చేసింది. గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్  కంపెనీ తయారుచేసిన ‘ఫావిపిరవిర్‌’ ట్యాబ్లెట్స్ ఫెబీ ఫ్లూ అనే బ్రాండ్ కింద మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ మందు మూడు దశలలో క్లినికల్ ప్రయోగాలలో 88 శాతం విజయవంతం అవడంతో ఔషధ నియంత్రణ అధీకృత సంస్థ డీజీసీఏ ‘ఫావిపిరవిర్‌’ మందును మార్కెట్లో విడుదల చేసేందుకు ఆమోదం తెలిపిందని ఆ సంస్థ తెలిపింది. ఈ మందును తీసుకోవడం ప్రారంభించిన నాలుగు రోజులలోనే రోగులలో కరోనా వైరల్ లోడ్ గణనీయంగా తగ్గిందని గ్లెన్‌మార్క్‌ ఫార్మా తెలిపింది.

ఫావిపిరవిర్‌ ట్యాబ్లెట్‌ ధర ఒక్కోటి రూ.103గా నిర్ణయించినట్లు ప్రకటించింది. దీనిని వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలని చెప్పింది. కరోనా వైరల్ లోడు(తీవ్రత)ను బట్టి తొలిరోజు 1800 ఎంజీ, రెండవరోజు నుంచి 14వ రోజు వరకు రోజుకు 800 ఎంజీ చొప్పున రెండు పూటలా వేసుకోవలసి ఉంటుందని గ్లెన్‌మార్క్‌ ఫార్మా తెలిపింది. వాణిజ్యస్థాయిలో ఈ మందు ఉత్పత్తి, అమ్మకానికి అనుమతి లభించింది కనుక అన్నీ మందుల సుకాణాలలో, ఆసుపత్రులలో ఇది ప్రజలకు అందుబాటులో ఉంటుందని గ్లెన్‌మార్క్‌ ఫార్మా తెలిపింది. 

దేశంలో రోజుకి 11-12,000 కొత్త కేసులు నమోదవుతుండటంతో దేశంలో శరవేగంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఇదేవేగంతో కరోనా వ్యాపిస్తే మున్ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక కరోనా నివారణ మందు కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు, యావత్ దేశ ప్రజలు కూడా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ మందుతో రోగులు త్వరగా కోలుకోగలిగితే, కరోనా మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతాయి. అంతేకాదు...కరోనా వైరస్ సోకకుండా అడ్డుకొనేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు దీంతో కరోనా మహమ్మారిని అదుపు చేయవచ్చు. కనుక గత మూడు నెలలుగా తీవ్ర భయాందోళనలోతో ఉన్న భారతీయులకు ఇది గొప్ప శుభవార్తేనని చెప్పవచ్చు.


Related Post