ట్విట్టర్‌లో మోడీని అన్‌ఫాలో చేసిన ట్రంప్‌

April 30, 2020


img

సోషల్ మీడియాలో మనకు నచ్చినవారిని ఫాలో అవుతూ వారికి సంబందించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ, అవసరమైతే మన అభిప్రాయాలు తెలియజేస్తుంటాము. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ అధికారిక నివాస కార్యాలయం వైట్ హౌస్ , రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోడీలతో సహా 19 మంది భారతీయ ప్రముఖులను ట్విట్టర్‌లో ఫాలో అవుతుండేది. కానీ ఇప్పుడు వారిరువురితో సహా మొత్తం 13 మంది భారతీయ ప్రముఖులను ట్విట్టర్‌లో అన్-ఫాలో చేసింది. అయితే ఏప్రిల్ 10న ప్రధాని నరేంద్రమోడీని ఫాలో అవడం మొదలుపెట్టి ఏప్రిల్ 29కే అన్-ఫాలో అవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనిపై వైట్ హౌస్ ఎటువంటి వివరణ ఈయలేదు కనుక ఎందుకు అన్-ఫాలో అయ్యిందో తెలియదు. దాంతో ప్రధాని నరేంద్రమోడీతో డోనాల్డ్ ట్రంప్‌ కటీఫ్ చెప్పేశారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలైపోయాయి.           

ఈ ఊహాగానాలపై వైట్ హౌస్ అధికారి స్పందిస్తూ, “సాధారణంగా అమెరికా అధ్యక్షుడు విదేశీ పర్యటనలు చేస్తున్నప్పుడు ఆయా దేశాధినేతలను వైట్ హౌస్ తాత్కాలికంగా సోషల్ మీడియాలో ఫాలో అవుతుంది. పర్యటన ముగిసిన కొన్ని రోజుల తరువాత ఆ అకౌంట్లను అన్-ఫాలో చేస్తుంటుంది. ఇది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియే తప్ప ప్రత్యేక కారణాలు ఏమీ లేవు,” అని చెప్పారు.


Related Post