కరోనాకు ముందు... తరువాత ప్రపంచం!

March 23, 2020


img

ఇప్పుడు ప్రపంచ చరిత్ర చెప్పుకోవాలంటే కరోనాను ముందు...కరోనాకు తరువాత అని చెప్పుకోవాలేమో? అగ్రదేశాలు కనిపెట్టిన అణుబాంబులు, క్షిపణుల కంటే కరోనా వైరస్‌ సృష్టిస్తున్న విధ్వంసం భయానకంగా ఉంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా దేశాలు తయారుచేస్తున్న యుద్ధవిమానాలు శత్రువుల రాడార్‌కు చిక్కకుండా మెరుపు వేగంతో దూసుకుపోయి శత్రువులను మట్టుపెట్టగలవు. కరోనా వైరస్‌ వాటి కంటే వేగంగా ప్రపంచదేశాలను చుట్టేస్తూ మానవాళిని కబళించివేస్తోంది. ప్రపంచంలో మహాశక్తివంతుడని చెప్పుకోబడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కూడా కరోనా వైరస్‌కు భయపడి పదేపదే చేతులు కడుక్కోవలసివస్తోంది. 

కరోనా వైరస్‌ వ్యాప్తితో మానవాళికి ముప్పు ఏర్పడుతుంటే, మరోవైపు దానిని కట్టడి చేసే ప్రయత్నాలలో ప్రపంచదేశాలు అన్ని వ్యవస్థలను మూసివేసుకోవడంతో ఆర్ధికవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం కనిపిస్తోంది. పరిశ్రమలు, వాణిజ్యసంస్థలు, కార్యాలయాలు, ఐ‌టి కంపెనీలు అన్ని మూతపడుతుండటంతో వాటిలో పనిచేసే లక్షలాది ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం కనిపిస్తోంది. కనుక ప్రపంచదేశాలన్నీ తప్పనిసరిగా వీలైనంత త్వరగా కరోనాను పూర్తిగా రూపుమాపవలసి ఉంది. లేకుంటే ముందే చెప్పుకొన్నట్లు కరోనాకు ముందు ప్రపంచం... కరోనా తరువాత ప్రపంచం అని చెప్పుకోవలసి వస్తుంది. 


Related Post