జబ్బర్దస్త్ విటులు!

March 04, 2020


img

 జబ్బర్దస్త్ కామెడీ షోలో మంచి పేరు సంపాదించుకున్న దొరబాబు, పరదేశి విశాఖలోని ఓ వ్యబిచారగృహంలో పట్టుబడ్డారు. విశాఖలోని మాధవధర చాలా పోష్ లోకాలిటీ. అక్కడ ఓ అపార్టుమెంటులో కొంతకాలంగా రహస్యంగా వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం అందుకొన్న టాస్క్ పోలీసులు అకస్మాత్తుగా దాడి చేయగా దొరబాబు, పరదేశీలతో పాటు మరో నలుగురు విటులు, ఒక మహిళ పట్టుబడ్డారు. పోలీసులు వారీనందరినీ అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించి వారిపై కేసులు నమోదు చేశారు. ఏదైనా ఓ రంగంలో పైకి ఎదగడం… దానిలో పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం చాలా కష్టమని అందరికీ తెలుసు. కానీ ఇటువంటి ఒకే ఒక తప్పటడుగుతో అవన్నీ కోల్పోవడమే కాకుండా వారి కుటుంబసభ్యులు కూడా తలదించుకోవలసివస్తుంది. ఈవిషయం దొరబాబు, పరదేశీలకు తెలియదనుకోలేము. 



Related Post