మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా?

February 08, 2020


img

మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగవైభవంగా సాగుతోంది. తెలంగాణ జిల్లాలతో సహా ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి కూడా రోజూ లక్షలాదిమంది భక్తులు మేడారం తరలివచ్చి సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకొంటున్నారు. కేంద్రమంత్రి అర్జున్ ముండా కూడా శుక్రవారం మేడారంకు వచ్చి అమ్మవార్ల దర్శనం చేసుకొని పూజలలో పాల్గొన్నారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “మేడారం జాతరకు కోటిమందికి పైగా భక్తులు వస్తారని విన్నాను. అది నేడు కళ్ళారా చూస్తున్నాను. ఇంతమంది తరలివస్తున్న మేడారం జాతరను జాతీయపండుగగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. డిల్లీ వెళ్ళాక నేను స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకువెళ్లి మేడారం జాతరను జాతీయపండుగగా గుర్తించాలని కోరుతాను,” అని చెప్పారు. 

దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోలేదు. మేడారం జాతర ప్రాశస్త్యం గురించి తెలిసి ఉన్న రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంపీలు, నేతలు కేంద్రమంత్రులతో మాట్లాడి ఒప్పించవచ్చు కానీ వారు అటువంటి ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు. రాష్ట్రానికి సంబందించిన ఏ సమస్యలనైనా రాష్ట్ర ప్రభుత్వం లేదా టిఆర్ఎస్‌ ఎంపీలదే బాధ్యత అన్నట్లు వ్యవహరిస్తుంటారు. కానీ రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా కేంద్రంపై ఒత్తిడి తెగలిగితే మేడారం జాతరకు గుర్తింపు సాధించడం అసాధ్యం కాదు.


Related Post