కొత్తగా వచ్చిన నామాకే లోక్‌సభ పదవి

June 13, 2019


img

ఈరోజు సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావులను పార్టీ లోక్‌సభ, రాజ్యసభ నేతలుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలకు పార్లమెంటు సమావేశాలలో ఏవిధంగా వ్యవహరించాలో సిఎం కేసీఆర్‌ దిశానిర్దేశనం చేశారు. ఎప్పటిలాగే, కేంద్రప్రభుత్వంత తటస్థ వైఖరితో వ్యవహరించాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలలో మోడీ ప్రభుత్వం మళ్ళీ ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టబోతోంది. గతంలో దానికి తెరాస మద్దతు తెలుపలేదు అలాగని వ్యతిరేకించలేదు. కనుక ఈసారి కూడా అదేవిధంగా వ్యవహరించవచ్చు. 

నామా నాగేశ్వరరావుకు పార్లమెంటరీ నాయకుడిగా అనుభవం ఉన్నందున ఆ పదవి కట్టబెట్టడం సహజమే. కానీ లోక్‌సభ ఎన్నికలలో టిడిపి పోటీ చేయకూడదని నిర్ణయించడంతో ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరి ఖమ్మం టికెట్ సంపాదించుకొని విజయం సాధించడం, వెంటనే తెరాస లోక్‌సభ పక్ష నేతగా ఎన్నికవడం అంతా కొన్ని రోజుల వ్యవధిలోనే జరిగిపోయింది. తెరాసలో ఇంత శరవేగంగా పైకి ఎదిగిన నేత ఎవరూ లేరనే చెప్పవచ్చు.


Related Post