కాంగ్రెస్‌ నేతల ప్రయత్నాలు ఫలించేనా?

June 10, 2019


img

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ  పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క హైకోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై వచ్చేవారం విచారణ చేపడతామని న్యాయస్థానం తెలిపింది. 

అయితే గత అనుభవాలను బట్టి చూస్తే స్పీకరు పరిధిలో ఉన్న ఈ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోకపోవచ్చు. లేదా గతంలో మాదిరిగానే స్పీకరుకు నోటీసు పంపించడంతో కధ ముగియవచ్చు. ఒకవేళ సుప్రీంకోర్టును ఆశ్రయించినా చివరికి ఇదే జరువచ్చు. గవర్నరు, రాష్ట్రపతి కూడా ఈ విషయంలో కలుగజేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈ ఫిరాయింపులను ప్రజలు కూడా పెద్దగా వ్యతిరేకించడం లేదు. ఇక కేంద్రప్రభుత్వం కూడా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నందున, ఫిరాయింపుల చట్టసవరణలు చేయడానికి ఆసక్తి చూపకపోవచ్చు. అంటే ఫిరాయింపుల వలన నష్టపోయిన పార్టీలు తప్ప ఈ వ్యవస్థలలో ఎవరూ దీనిని సమస్యగా భావించడం లేదు...కనుక పట్టించుకోవడంలేదని స్పష్టం అవుతోంది. కనుక కాంగ్రెస్‌ నేతలది అరణ్యరోదనగానే మిగిలిపోవచ్చు.  


Related Post