రాహుల్ రాజీనామా...ఇప్పుడు కాదు

May 28, 2019


img

ఊహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీలో చిన్నా పెద్దా అందరూ అభ్యంతరం చెప్పడంతో రాహుల్ గాంధీ తన రాజీనామా ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేసుకొన్నారు. లోక్‌సభ ఎన్నికలలో ఓటమి కారణంగా తీవ్ర నిరాశానిస్పృహలలో కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతున్నప్పుడు పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేస్తే పార్టీ పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంటుంది పైగా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందని సీనియర్ కాంగ్రెస్‌ నేతలు నచ్చజెప్పడంతో రాహుల్ గాంధీ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకొన్నట్లు తెలుస్తోంది. ఆలోగా సరైన నాయకుడుని గుర్తించి పార్టీ పగ్గాలు అప్పజెప్పేందుకు పార్టీలో అంతర్గతంగా కసరత్తు చేస్తారని సమాచారం. 



Related Post