తెలంగాణ రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్‌తో పాటు వివిదజిల్లాలో కొత్తగా 9 న్యాయస్థాలు ఏర్పాటయ్యాయి. వీటి ఏర్పాటు కోసం తెలంగాణ న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్ రావు ఆయా జిల్లాలువారిగా ఉత్తర్వులు జారీ చేశారు.
1. హైదరాబాద్ నగరంలో సెషన్స్ జడ్జి హోదాలో రెండు కోర్టులను ప్రభుత్వం ఏర్పాటవుతున్నాయి. వాటిలో ఒకటి ఎల్బీనగర్‌లో ఏర్పాటు చేస్తారు. ఈ రెండు కోర్టులలో కేవలం మైనర్ పిల్లలపై హింస, లైంగిక వేధింపులు వంటి కేసులను పోక్సో చట్టం క్రింద విచారిస్తారు.
2. కరీంనగర్ జిల్లాలో గోదావరిఖనిలో: సీనియర్ సివిల్ జడ్జి కోర్టు
3. ధర్మపురిలో: జూనియర్ సివిల్ జడ్జి కోర్టు
4. నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లో: జూనియర్ సివిల్ జడ్జి కోర్టు
5. పెద్దపల్లి జిల్లాలో: జిల్లా కోర్టు
6. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లిలో: సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, జూనియర్ సివిల్ జడ్జి/మొదటి తరగతి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు.