సుమన్ ప్రచారంలో ఓదేలు ఎక్కడ?

October 25, 2018


img

తెరాస చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు మళ్ళీ పోటీ చేసేందుకు టికెట్ నిరాకరించడంతో పార్టీపై తిరుగుబాటుకు సిద్దమయిన సంగతి తెలిసిందే. కానీ ఆయన అనుచరుడు గట్టయ్య అత్యుత్సాహం ప్రదర్శించి ప్రాణాలు కోల్పోవడంతో ఓదేలు పరిస్థితి హటాత్తుగా తారుమారయింది. అంతకు ముందు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్దపడిన ఓదేలు, గట్టయ్య మృతి తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

సిఎం కేసీఆర్‌ క్లాస్ పీకిన తరువాత చెన్నూరు నుంచి పోటీ చేస్తున్న బాల్కా సుమన్ కు అన్ని విధాలా సహకరిస్తానని, ఆయన విజయానికి తన అనుచరులు కూడా కృషి చేయాలని చెప్పారు. కానీ బాల్కా సుమన్ చెన్నూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నా ఓదేలు ఆయన అనుచరులు ఎక్కడా కనబడటం లేదు.

అయితే వారి అడ్డు తొలగిపోవడంతో, బాల్కా సుమన్ ఆయన అనుచరులు, ఉత్సాహంగా చెన్నూరు నియోజకవర్గాలలో జోరుగా ఎన్నికల ప్రచారం చేసుకొంటున్నారు. బాల్క సుమన్ శెట్‌పల్లి, గంగిపల్లి, ఎల్కంటి, నర్సింగాపూర్, మద్దులపల్లి, బెజ్జాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరి ఎమ్మెల్యేగా ఒకవెలుగు వెలిగిన ఓదేలు రాజకీయ భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోందో చూడాలి.


Related Post