శ్రీరెడ్డి వివాదం ముగిసినట్లేనా?

May 02, 2018


img

తెలుగు సినీ పరిశ్రమలో మహిళా నటులపై లైంగిక వేధింపుల గురించి నటి శ్రీరెడ్డి మొదలుపెట్టిన పోరాటం హటాత్తుగా ముగిసిపోయినట్లే కనిపిస్తోంది. ఇప్పుడు మీడియా కానీ, సినీ పరిశ్రమలో వారుగానీ ఈ విషయం గురించి మాట్లాడటమే లేదు. ఇది ఎంత ఆకస్మికంగా మొదలైందో అంతే హటాత్తుగా ముగిసిపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కారణాలు ఏవైనప్పటికీ, దీని గురించి చాలా హడావుడి చేసిన శ్రీరెడ్డి, మీడియా, రామ్ గోపాల్ వర్మ, కత్తి మహేష్ అందరూ సడన్ గా సైలెంట్ అయిపోయారు. 

ఇక ఈ వ్యవహారాన్ని మలుపు తిప్పిన పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు దీని గురించి మాట్లాడటం లేదు. కొన్ని న్యూస్ ఛానల్స్ మీద వాటి వెనుక ఉన్నవారిపై సుదీర్ఘమైన న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. ఆ సంగతి ఏమయిందో ఆయనకే తెలియాలి. అంటే శ్రీరెడ్డి లేవనెత్తిన సమస్య పరిష్కారం అయిపోయిందనుకోవాలా లేక సినీ పరిశ్రమ, మీడియా అందరూ రాజీపడి ఈ సమస్యను కూడా ఇదివరకు తలెత్తిన మాదకద్రవ్యాల సమస్యలాగే అందరూ కలిసి గొయ్యి తీసి కప్పేశారనుకోవాలా? 


Related Post