తెరాస సర్కార్ పై కోదండరాముడు బాణం?

February 22, 2018


img

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన స్థాపించబోతున్న తెలంగాణా జన సమితి (టిజెఎస్)కి బాణం గుర్తు కేటాయించవలసిందిగా కోరినట్లు, అందుకు ఎన్నికల కమీషన్ సానుకూలంగా స్పందించినట్లు తాజా సమాచారం. తెరాస సర్కార్ పనితీరు పట్ల అసంతృప్తితోనే కోదండరాం పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తున్నారు కనుక, తెరాసపైనే ఆ బాణం సంధించబోతున్నారనుకోవచ్చు.

ఇటువంటి కొత్త పార్టీలు ఎన్ని పుట్టుకువచ్చినా తమకు ఫరక్ పడదని, ఎందుకంటే ప్రజలు తమవైపే ఉన్నారని కనుక వచ్చే ఎన్నికలలో తెరాస 100 కు పైగా సీట్లు గెలుచుకోవడం ఖాయమని లేకుంటే రాజకీయ సన్యాసానికి సిద్దమని కేటిఆర్ వంటి యువ నేతలు బల్లగుద్ది వాదిస్తున్నారు. రామబాణానికి తిరుగు ఉండదనే సంగతి అందరికీ తెలుసు కానీ ఈ కోదండరాముడు సందించబోతున్న రాజకీయ బాణం తన లక్ష్యాన్ని చెందించగలదా లేదా? ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకొందామనుకొంటున్న తెలంగాణా జన సమితి, కనీసం 70 సీట్లు ఖచ్చితంగా గెలుచుకొంటామని చెపుతున్న కాంగ్రెస్, మోడీ భజన చేస్తున్న  భాజపా, నేటికీ హేమాహేమీలున్న తెదేపా,  ఎంతో కొంత ప్రభావం చూపగల బి.ఎల్.ఎఫ్ కూటమి, ముస్లింల ఓట్లను గంపగుత్తగా స్వంతం చేసుకోగల మజ్లీస్ పార్టీ బరిలో నిలిచి ఉన్నప్పటికీ తెరాస 100-106 సీట్లు గెలుచుకొని తన సత్తా నిరూపించుకోగలదా లేదా అనేది ఎన్నికలొస్తే గానీ తెలియదు.


Related Post