టాంక్ బంద్ వద్ద అమరవీరుల స్మారక మందిరం

February 22, 2018


img

తెలంగాణా రాష్ట్ర సాధనకొరకు బలిదానాలు చేసుకొన్న అమరవీరుల స్మృత్యర్ధం హుస్సేన్ సాగర్ సమీపంలో ఒక స్మృతి వనం, ఒక ఎత్తైన స్థూపం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడే ఈ స్మృతి వనంలో ప్రమిద ఆకారంలో ఉండే ఒక అందమైన భవనం నిర్మిస్తారు. స్థూపంపైన తెలంగాణా తల్లి విగ్రహం ఉంటుంది. దీనిలో తెలంగాణా సాధన కోసం జరిగిన పోరాటాల వివరాలు, వాటికి సంబంధించి చిత్రాలు, అమరవీరుల పేర్లు, చిత్రాలు మొదలైనవన్నీ ఏర్పాటు చేస్తారు. తద్వారా తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఏవిధంగా పోరాటాలు సాగాయో దాని కోసం ఎంతమంది త్యాగాలు చేశారో భవిష్యత్ తరాలవారు తెలుసుకోగలుగుతారని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నారు. అమరవీరుల స్మృతి వనం, దానిలో భవనం, స్థూపం డిజైన్లను ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం ఆమోదించారు. త్వరలోనే వీటి నిర్మాణానికి ముఖ్యమంత్రి కెసిఆర్ శంఖుస్థాపన చేస్తారు.    



Related Post