వాళ్ళకే ఆ పదవులు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

February 21, 2018


img



ఎన్నికల సమయంలో అన్ని పార్టీలపై టికెట్ల కోసం తీవ్ర ఒత్తిడి ఉంటుంది. కానీ అందరికీ టికెట్స్ ఇవ్వడం సాధ్యం కాదు కనుక కొంతమందికి పార్టీలో పదవులు కట్టబెడుతుంటాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ అదే చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేయబోతోంది. ఎన్నికలలో పోటీ చేయనివారికే జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్ష పదవులు ఇవ్వాలని రాహుల్ గాంధీ నిర్ణయించారని రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అయితే ప్రస్తుతానికి పాత 10 జిల్లాల ప్రకారమే డిసిసిలు పనిచేస్తాయని చెప్పారు. 

కనుక ఎన్నికల బరిలో నుంచి తప్పుకొన్నవారిలో 10 మందికి ఈ పదవులు లభించే అవకాశం ఉందని స్పష్టం అయ్యింది. కానీ బరిలో ఇంకా చాలామందే ఉంటారు కనుక మున్ముందు 31 జిల్లాలకు డిసిసిలను ఏర్పాటు చేసి, అధ్యక్ష పదవులను పంచిపెట్టే అవకాశం కూడా ఉంది. ఇవి కాక జాతీయస్థాయిలో ఎఐసిసి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలలో తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించదలిస్తే పార్టీలో సీనియర్లకు ఆ పదవులను సర్దుబాటు చేయవచ్చు. 

కాంగ్రెస్ పార్టీలో నేతలలో చాలా మంది టికెట్లు సాధించుకోవడంపై చూపే శ్రద్ధ, పార్టీని గెలిపించుకోవడంలో చూపరు. ఈ కారణంగానే 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక చక్కటి అవకాశాన్ని చేజార్చుకొంది. కనుక ఈసారైన అటువంటి తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడితే మంచిది. 


Related Post