తెలంగాణా ప్రజలు వయసుతో సంబంధం లేకుండా తెరాస ఎంపి కవితను ప్రేమతో కవితక్కని సంభోదిస్తుంటారు. కానీ ఒకప్పుడు ఆమెను తీవ్రంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆమెను చెల్లెల్లని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని, విభజన సమయంలో ఏపికి ఇచ్చిన హామీలను అన్నిటినీ అమలుచేయాలని కవితక్క పార్లమెంటులో కేంద్రాన్ని కోరారు. అంతేగాక వాటి కోసం పోరాడుతున్న ఏపి ఎంపిలకు ఆమె సంఘీభావం తెలిపారు. అందుకే పవన్ కళ్యాణ్ ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకొంటూ, ‘ఏపీకి ఇచ్చిన హమీలను నెరవేర్చాలని లోక్ సభలో కేంద్రాన్ని గట్టిగా అడిగి ఏపికి మద్దతు తెలిపిన తెరాస ఎంపీ, చెల్లెలు కవితగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని పవన్ ట్వీట్ చేశారు.