సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్స్ లభిస్తాయా?

February 08, 2018


img

వచ్చే ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 99% మందికి టికెట్స్ కేటాయిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇదివరకు ఒకసారి హామీ ఇచ్చారు. ఇక సర్వేలలో తెరాసకు 105-109 సీట్లు వస్తాయని జోస్యం చెపుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ తప్ప ప్రతిపక్ష పార్టీలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయ్యున్నాయి. కనుక ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చినట్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్స్ కేటాయించేయవచ్చునని అర్ధం అవుతోంది. అయితే ఎమ్మెల్యేల పనితీరుపై చేయించిన సర్వేలలో కొంతమంది పట్ల ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తేలింది. వారి పనితీరు మార్చుకొని, ప్రజలలో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి గట్టిగా కృషి చేయమని కెసిఆర్ ఆ ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి. కానీ నేటికీ కొంతమంది ఎమ్మెల్యేల పనితీరులో ఎటువంటి మార్పు కనబడటం లేదని తెలుస్తోంది. కనుక వారికి వచ్చే ఎన్నికలలో టికెట్స్ కేటాయించకపోవచ్చు. మరికొందరిని వేరే నియోజకవర్గాలకు మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కనుక సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్స్ లభించే అవకాశం ఉండకపోవచ్చునని భావించవచ్చు 

ఇక ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదుర్కోవలసి ఉంటుంది కనక తెరాసలో బలమైన కేటిఆర్, కవిత, హరీష్ రావు, ఈటెల వంటి నాయకులను కాంగ్రెస్ లో బలమైన నాయకులు పోటీ చేసే చోట నిలబెట్టే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కవిత వరుసగా జగిత్యాల్ నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్న కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిపై కవితను, శేరిలింగంపల్లి నుంచి కేటిఆర్ ను పోటీ చేయించాలని కెసిఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 27న తెరాస ప్లీనరీ సభల తరువాత టికెట్స్ విషయంపై కొంత స్పష్టత రావచ్చు. 


Related Post