భాజపాకు రాజస్థాన్ ట్రిపుల్ తలాక్?

February 03, 2018


img

మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ట్రిపుల్ తలాక్’ బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేయనప్పటికీ భాజపా పాలిత రాష్ట్రమైన రాజస్థాన్ లో ప్రజలు దానిని స్పూర్తిగా తీసుకొని ఇటీవల జరిగిన ఉపఎన్నికలలో భాజపాకు ‘ట్రిపుల్ తలాక్’ చెప్పేశారు. అంటే అజ్మీర్ మండల ఘడ్, ఆల్వార్ మూడు శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికలలో భాజపా ఓడిపోయింది. కాంగ్రెస్ నేతలు అదే విషయం ప్రస్తావిస్తూ మోడీ సర్కార్ కు చురకలు వేస్తున్నారు. అయితే వారి చురకల కంటే స్వంత పార్టీకే చెందిన అసంతృప్త నేత శత్రుఘ్న సిన్హా వేసిన ట్వీట్ వాతలు మరీ మంట పుట్టించేవిగా ఉన్నాయి. అయన ఏమి ట్వీట్ చేశారంటే: 

“బ్రేకింగ్ న్యూస్: అధికార పార్టీ అన్ని రికార్డులను బద్దలు చేస్తూ ఘోరంగా ఓడిపోయింది. భాజపాకు ట్రిపుల్ తలాక్ ఇచ్చిన రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. అజ్మీర్..తలాక్, ఆల్వార్..తలాక్, మండల ఘడ్...తలాక్ ! మా ప్రత్యర్ధులు రికార్డు స్థాయిలో గెలిస్తే, వారి చేతిలో మా పార్టీ దానుమగా ఓడిపోయింది. మా ప్రత్యర్ధులు మా పార్టీని ఒక కుదుపు కుదిపేశారు.” అని ట్వీట్ చేశారు. 

మరో ట్వీట్ లో  “ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. తక్షణ నష్ట నివారణ చర్యలను పార్టీ తీసుకోవాలి. లేకపోతే భాజపా పతనం కొనసాగుతుంది. టాటా...బైబై ఫలితాలే మున్ముందు చవిచూడాల్సి వస్తుంది. బీజేపీ మేలుకో. జైహింద్” అని మెసేజ్ పెట్టారు. శత్రుఘన్ సిన్హా ట్వీట్ చూస్తే భాజపా ఓటమికి బాధపడుతున్నట్లు లేదు. చాలా సంతోషిస్తున్నట్లుంది. ఆ ఓటమిని భాజపా ఓటమిగా కాక ప్రధాని మోడీ ఓటమిగా భావిస్తున్నట్లున్నారు. అందుకే మోడీ ఓడిపోయినట్లు చాలా సంతోషిస్తున్నారు. అయితే ఉపఎన్నికలలో ఓటమిని మోడీ పాలనతో ముడి పెట్టి చూడటం అవివేకమే. సాధారణంగా ఉపఎన్నికలలో స్థానిక సమస్యలు, స్థానిక రాజకీయాలు, కులాల సమీకరణల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఓటమిని మోడీ ఓటమిగా భావించి భాజపా సీనియర్ నేత శత్రుఘన్ సిన్హా  సంతోషపడటమే చాలా విడ్డూరంగా ఉంది.


Related Post