ఆపరేషన్ కావేరీ... సూడాన్ నుంచి భాతీయుల తరలింపు

April 26, 2023
img

సూడాన్ అంతర్యుద్ధంలో చిక్కుకొన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరీ పేరుతో చర్యలు చేపట్టింది. దీని కోసం భారత వాయుసేన, నావికా దళానికి చెందిన నౌకాలను, విమానాలను సూడాన్‌కు పంపించి ముందుగా వారిని అక్కడి నుంచి సమీపంలో గల సౌదీ అరేబియాలోని జెడ్డా నగరానికి చేరవేస్తోంది. అక్కడి నుంచి విమానాలలో భారత్‌కు తరలిస్తోంది. 

మొదటి బ్యాచ్‌లో ఐఎనెఎస్ సుమేదా నౌక ద్వారా 278 మంది భారతీయులను జెడ్డాకు చేర్చినట్లు భారత విదేశాంగశాఖ తెలిపింది. రెండో బ్యాచ్‌లో 148 మందిని వాయుసేన విమానం ద్వారా నేరుగా భారత్‌కు చేర్చిన్నట్లు తెలిపింది. సూడాన్‌లో మొత్తం 3,000 మంది భారతీయులున్నారని వారందరినీ సురక్షితంగా తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. సూడాన్‌లో చివరి భారతీయుడిని కూడా తరలించేవరకు ఆపరేషన్ కావేరి కొనసాగుతుందని తెలిపింది. నేడు బుదవారం మూడో బ్యాచ్‌లో మరో 135 మందిని ఐఏఎఫ్ సి-130జె విమానంలో జెడ్డాకు తరలించామని, అక్కడి నుంచి వారిని స్వదేశానికి తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని భారత విదేశాంగశాఖ ప్రతినిధి వీ.మురళీధరన్ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.


సూడాన్‌లో ప్రభుత్వ దళాలకు, దానిని వ్యతిరేకిస్తున్న దళాలకు మద్య మొదలైన అంతర్యుద్ధంలో ఇప్పటి వరకు 400 మంది పోరులు చనిపోగా 4,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సూడాన్‌లో ఉన్న వేలాదిమంది విదేశీయుల తరలింపు కోసం అమెరికా ఒత్తిడి మేరకు ఈ నెల 24 నుంచి మూడు రోజులపాటు కాల్పుల విరమణ పాటిస్తోంది. ఈరోజు అర్దరాత్రి ఆ గడువు ముగియనుంది. కనుక సూడాన్‌లో చిక్కుకొన్న భారతీయులందరినీ సురక్షితంగా తరలించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ కావేరీ చేపట్టింది.



Related Post