గుజరాత్ లో మళ్ళీ కమల వికాసమే..నా?

December 14, 2017


img

గుజరాత్ మలిదశ పోలింగ్ కూడా ఈరోజు పూర్తవడంతో వివిధ సర్వే సంస్థలు తమ సర్వే ఫలితాలను ప్రకటించాయి.  ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ప్రకటించిన సర్వే ఫలితాలలో గుజరాత్ లో ఈసారి భాజపా, కాంగ్రెస్ పార్టీలకు ఇంచుమించు సరిసమానమైన స్థానాలు గెలుచుకొనే అవకాశం ఉందని చెప్పిన సర్వే సంస్థలు, ఈరోజు పోలింగ్ పూర్తవగానే నిర్వహించిన సర్వేలో మళ్ళీ భాజపాయే స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని ప్రకటించడం విశేషం. అదే నిజమైతే మోడీ సర్కార్ తీసుకొన్న నోట్ల రద్దు, జి.ఎస్.టి., నగదు రహిత లావాదేవీలు వంటి సాహసోపేత నిర్ణయాల వలన ఎదుర్కొన్న ఇబ్బందులను, కష్టనష్టాలను గుజరాత్ ప్రజలు పట్టించుకోలేదని, మోడీపై వారి నమ్మకం చెక్కు చెదరలేదని అర్ధం అవుతుంది. 

వివిధ సర్వే సంస్థలు ప్రకటించిన ఫలితాల అంచనాలు ఈవిధంగా ఉన్నాయి. 

ఇండియా టీవి-వి.ఎం.ఆర్. 

ఓట్ షేర్ : భాజపా 45, కాంగ్రెస్ పార్టీ: 40, ఇతరులు: 15 శాతం.

సీట్లు: భాజపా 106-116, కాంగ్రెస్ పార్టీ: 63-73, ఇతరులు: 2-4. 

ఎబిపి న్యూస్-సి.ఎస్.డి.ఎస్. 

ఓట్ షేర్: భాజపా 43, కాంగ్రెస్ పార్టీ: 43, ఇతరులు: 14 శాతం

టైమ్స్ నౌ-వి.ఎం.ఆర్: భాజపా 115-125, కాంగ్రెస్ పార్టీ: 57-65, ఇతరులు: 0. 

ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా: భాజపా 118-134, కాంగ్రెస్ పార్టీ: 49-61, ఇతరులు: 0-3. 

ఈ సంస్థలు ప్రకటించిన సర్వే ఫలితాలు ఎంతవరకు నిజమవుతాయో ఈనెల 18వ తేదీన ఫలితాలు వెలువడితే కానీ తెలియదు. 


Related Post