టిటిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీ నుంచి ఎంతమంది నేతలు వెళ్ళిపోయినా పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. బహుశః అందుకేనేమో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మందని, రాజన్న సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజకవర్గపు టిటిడిపి ఇన్-ఛార్జ్ లు అన్నమనేని నర్సింగరావు, పెర్యాల్ రవీందర్ రావు, కర్రు నాగయ్య ముగ్గురూ తెదేపాకు గుడ్-బై చెప్పేసి రేపు ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో తెరాసలో చేరబోతున్నారు. కరీంనగర్ నుంచే మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. విశేషమేమిటంటే, ఎల్.రమణ స్వస్థలం జగిత్యాల్ కావడంతో ఈ మూడు నియోజకవర్గాలపై ఆయనకు మంచి పట్టుంది. అక్కడి నుంచే టిటిడిపి ఖాళీ అయిపోతుండటమే విశేషం. ఒకపక్క వేగంగా పార్టీ ఖాళీ అయిపోతుంటే, అయన రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ, సవాళ్ళు విసురుతూ కాలక్షేపం చేయడం విశేషమే.