డిఎస్ గురించి మళ్ళీ అవే గుసగుసలు!

November 04, 2017


img

తెరాస రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ మీడియాలో ప్రస్తావన వస్తే అది ఖచ్చితంగా పార్టీ మారడానికి సంబందించిన వార్తే అయ్యుండటం విచిత్రమే. అయన కుమారుడు అరవింద్ తెరాసకు గుడ్ బై చెప్పేసి భాజపాలో చేరిపోవడమే అందుకు ప్రధాన కారణం. త్వరలోనే ఆయన కూడా తెరాసకు గుడ్ బై చెప్పేసి భాజపాలో చేరిపోతారని ఆ మద్య వార్తలు వచ్చినప్పుడు అయన వాటిని ఖండించారు. అయితే దానర్ధం ఆయన భాజపాలో చేరడం లేదనే కానీ పార్టీ మారడం లేదని కాదని కొందరు విడమరిచి చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన స్వభావానికి భాజపాలో ఇమడటం కష్టం కనుక మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరుకొనే అవకాశాలున్నాయని మళ్ళీ రాజకీయ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ‘ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్’ అన్నట్లుగా అధికార తెరాసలో చేరడం ఇష్టం లేనివారు, తెరాసలో అసంతృప్తులు, తెదేపాలో ఆందోళనలో ఉన్నవారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీవైపే అడుగులు వేస్తున్నారు. కనుక డి శ్రీనివాస్ కూడా నలుగురితో బాటు నారాయణ అనుకొంటూ మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోవాలనుకొంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కనుక ఆయన మళ్ళీ వీటిని ఖండిస్తారో లేదో చూడాలి. 


Related Post