కొడంగల్ ఉపఎన్నికలు బాబు చేతిలో?

November 02, 2017


img

రేవంత్ రెడ్డి తెదేపాను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నప్పుడు తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే దానిని పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. ఒకవేళ రేవంత్ రెడ్డికి నిజంగా తన పదవికి రాజీనామా చేయాలనుకొంటే దానిని తెలంగాణా శాసనసభ స్పీకర్ కు ఇచ్చి ఉండాలి. కానీ అలా చేయలేదంటే అయనకు తన రాజీనామాను ఆమోదింపజేసుకోవాలను కోవడం లేదని స్పష్టం అవుతోంది.

రేవంత్ రెడ్డి తెదేపాకు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ లో చేరిపోయినప్పటికీ, నేటికీ చంద్రబాబు నాయుడు పట్ల చాలా కృతజ్ఞతాపూర్వకంగా, చాలా గౌరవంగానే మాట్లాడుతున్నారు. కనుక ఆ రాజీనామా లేఖను చంద్రబాబు నాయుడు తెలంగాణా శాసనసభ స్పీకర్ ఎప్పుడు పంపిస్తారో...అసలు పంపిస్తారో లేదో కూడా చెప్పలేము. కనుక కొడంగల్ ఉపఎన్నికలు కూడా చంద్రబాబు నాయుడు చేతిలోనే ఉన్నాయని చెప్పకతప్పదు. ఒకవేళ రేవంత్ రెడ్డి కొడంగల్ లో తనకు సవాలు విసురుతున్న తెరాసకు తన సత్తా చూపాలనుకొంటే, అయన మరో రాజీనామా లేఖను వ్రాసి తెలంగాణా శాసనసభ స్పీకర్ కు అందించవచ్చు. కానీ ఆయన ఆ పని చేస్తారా లేదో చూడాలి. ఒకవేళ ఇస్తే మాత్రం కొడంగల్ ఉపఎన్నికలు అనివార్యం అవుతాయి. 


Related Post