కేసీఆర్ లెక్కలు మారాయేమిటి?

October 26, 2017


img

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతీ శాసనసభ సమావేశాల ముందు జరిగే లెజిస్లేటివ్ సమావేశంలో తప్పకుండా చెప్పే విషయం ఒకటుంటుంది. అదే..2019 ఎన్నికలలో తమ పార్టీ ఎన్ని శాసనసభ స్థానాలు గెలువబోతోందనే లెక్కలు. క్రిందటిసారి శాసనసభ సమావేశాలకు ముందు జరిగిన పార్టీ ఎల్పి సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో తమ పార్టీ 104-106 సీట్లు గెలుచుకోబోతోందని చెప్పారు. కానీ ఈసారి ఆ లెక్కలు సవరించి 96-104 స్థానాలు గెలుచు కోబోతోందని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన ఎప్పటికప్పుడు తమ ప్రభుత్వం గురించి ప్రజాభిప్రాయం ఏవిధంగా ఉందని సర్వేలు చేయించుకొని ఆ వివరాలు చెప్పుతుంటారు. కనుక ఇదివరకు చెప్పినదానితో పోలిస్తే 7-8 సీట్లు తగ్గాయి కనుక తమ ప్రభుత్వం పట్ల ప్రజలలో కొంత వ్యతిరేకత పెరిగిందని అంగీకరిస్తునట్లుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ లెక్కలలో ఇంకా అనేక మార్పులు చేర్పులు రావచ్చునేమో? సవరించిన ఈ లెక్కలపై రేపు ప్రతిపక్ష నేతలు కామెంట్స్ చేయకమానరు.   



Related Post