అక్టోబర్ 14న తానా రీజియనల్ కాన్ఫారెన్స్

September 30, 2017


img

అమెరికాలో తెలుగువారికి కేరాఫ్ అడ్డ్రస్ గా చెప్పుకోబడే తానా ప్రాంతీయ సదస్సు అక్టోబర్ 14న లాన్స్ డేల్ లో జరుగబోతోంది. ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య సమావేశాలు, బిజినెస్ సెమినార్లు నిర్వహించబడతాయని తానా అధ్యక్షులు సతీష్ వేమనగారు తెలియజేశారు. 

లాన్స్ డేల్ లోని 1340 ఎస్.వ్యాలీ, ఫోర్జ్ రోడ్డులో గల నార్త్ పెన్ హైస్కూల్ , పిఏ-19446 లో అక్టోబర్ 14న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ చిత్ర..ఆమె బృందం ఆర్కెస్ట్రా ఉంటుంది. ఈ సంగీత కార్యక్రమంలో హేమచంద్ర, గీతామాధూరి, శ్రీకృష్ణ, సమీర భరద్వాజ్, పృథ్వి పాటలు పాడుతారు. 

ఈ కార్యక్రమాలకు అతిధులుగా ప్రముఖ సినీ నటులు భాను ప్రియ, కమలిని ముఖర్జీ, నారా రోహిత్, నందు హాజరుకాబోతున్నారు.     

ఈ కార్యక్రమాలలో పాల్గొని ఆనందించడానికి పెద్దలు ఒక్కొక్కరికీ $25, పిల్లలకు $10 టికెట్ ధరగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఉచితం. 

ఈ కార్యక్రమాల గురించి మరిన్ని వివరాల కోసం 908-930-6735, 267-252-2496, 973-610-4385 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు లేదా phillytana@gamil.com అనే ఈమెయిల్ కు వ్రాసి పూర్తి వివరాలు పొందవచ్చు. 

ఈ కార్యక్రమాలకు స్ప్రూస్ ఇన్ఫో టెక్, క్యూర్ లెర్నింగ్, ఆంధ్రా బ్యాంక్, పి.ఎం.జె., ఎస్.టి.ఎస్.స్యూర్ టెక్ సర్వీసస్, ఈ.ఏ.టీం, కోవెంట్ సొల్యూషన్స్, టి.ఐ.ఎస్., స్వరాజ్య, బిర్యానీస్, కోస్పిర, తదితర సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ కార్యక్రమాలకు మీడియా పార్ట్ నర్స్ గా ఎన్.టీవి, టీవి-5, మన టీవి, ఐ డ్రీం మీడియా.కాం వ్యవహరిస్తున్నాయి. 

అమెరికాలో తెలుగువారందరికీ ఈ కార్యక్రమాలకు తానా ఆహ్వానం పలుకుతోంది.


Related Post