తూచ్ దీక్ష క్యాన్సిల్: కోమటిరెడ్డి

September 28, 2017


img

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడూ హడావుడిగా ఏదో నోరుజారడం తరువాత తూచ్ అంటూ వెనక్కు తగ్గడం మామూలే. నల్లగొండ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ త్వరలో 48గంటలు నిరాహార దీక్షకు కూర్చొంటానని కోమటిరెడ్డి ప్రకటించారు. కానీ మళ్ళీ మనసు మార్చుకొని ఇప్పుడు నిరాహార దీక్ష చేయదలచుకోలేదని ప్రకటించారు. తనకు సోనియా గాంధీ అనుమతిస్తే నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డిపై ఉపఎన్నికలలో పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని చెప్పారు. 

నిజానికి కోమటిరెడ్డి మెడికల్ కాలేజీ కోసం నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించినప్పుడు తెరాస సర్కార్ చాలా ఇబ్బంది పడింది. ఎందుకంటే నల్లగొండ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తానని మూడేళ్ళ క్రితం కేసీఆర్ హామీ ఇచ్చారు. దాని గురించి కోమటిరెడ్డి ఎన్నిసార్లు అడిగినా ప్రభుత్వం స్పందించలేదు. కనుక ఒకవేళ కోమటిరెడ్డి మెడికల్ కాలేజీ కోసం నిరాహార దీక్షకు కూర్చొని ఉండి ఉంటే జిల్లా ప్రజల దృష్టిలో తెరాస సర్కార్, ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి దోషులుగా నిలబడవలసివచ్చేది. కానీ కోమటిరెడ్డి హటాత్తుగా తన నిర్ణయం మార్చుకోవడంతో తెరాసకు ఊరట కల్పించినట్లయింది. అంతే కాదు..ఆయన ఒకపక్క తెరాస సర్కార్ ను విమర్శిస్తూనే మరోపక్క తెరాసలో చేరేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారనే గుత్తా ఆరోపణలకు బలం చేకూర్చినట్లయింది. 


Related Post