ఈ ఐడియా జీవితాన్ని మార్చేస్తుందా?

September 14, 2017


img

ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని ఐడియా మొబైల్ సర్వీస్ చెపుతుంటుంది. జియో నుంచి వస్తున్న పోటీని తట్టుకొని తన మనుగడ కాపాడుకోవడానికి ఇప్పుడు తానే స్వయంగా ఒక ఐడియా కోసం ఆలోచించవలసి వచ్చింది.  చివరకు నిన్న ఈ ఐడియాను ప్రకటించింది.

ఐడియా ప్రీ-పెయిడ్ కస్టమర్లు రూ.697లతో రీ-ఛార్జ్ చేసుకొన్నట్లయితే వారికి రోజుకు 1.5 జిబి చొప్పున 84 రోజులలో మొత్తం 126 జిబ్ డేటాను అందిస్తామని ప్రకటించింది. దానితో బాటు అపరిమిత లోకల్ మరియు ఎస్టిడి కాల్స్ సౌకర్యం కూడా కల్పిస్తామని తెలియజేసింది.

కస్టమర్లను ఆకర్షించడానికి జియో రోజుకు 1 జిబి డేటాను ఇస్తుంటే, ఐడియా 1.5 జిబి ఇవ్వడం మంచి ఐడియా అనే చెప్పుకోవచ్చు. కానీ జియో ‘ధన్ ధనా ధన్’ ఆఫర్ క్రింద కేవలం రూ.399 లకే 84 రోజులపాటు ఈ ఆఫర్ ను అందిస్తున్నప్పుడు వినియోగదారులు రూ.697 ఎందుకు ఖర్చు చేస్తారు? అని ఆలోచిస్తే ఈ ఐడియా వర్క్ అవుట్ అయ్యే అవకాశం లేదని స్పష్టం అవుతోంది.

అయినా జియో ప్లాన్స్, దాని టారిఫ్ లను కాస్త అటుఇటూ తిప్పి ఇదే గొప్ప ఐడియా అనుకొంటే ఎలా? జియో లాంచింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతీసారి ప్రజలు, తన పోటీదారులు ఎవరూ ఊహించలేని సరికొత్త ప్లాన్స్, ఆకర్షణీయమైన ఆఫర్స్, టారీఫ్ లను ప్రకటిస్తూనే ఉంది. ఆ కారణంగా దాని కస్టమర్ల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉన్నారు. దీనిని జియో పోటీ సంస్థలు కూడా గుర్తించాయి. కనుక అవి కూడా అటువంటి విన్నూత్నమైన ఐడియాలను ఆలోచించవలసి ఉంటుంది. అది కూడా జియో 4జి ఫీచర్ ఫోన్స్ ప్రజల చేతులలో పడకముందే ఒక అద్భుతమైన ఐడియా కోసం ఆలోచించాలి లేకుంటే అన్ని మొబైల్ సర్వీస్ సంస్థల మనుగడకు మూలమైన 2జి వినియోగదారులు జియోలోకి మారిపోవడం ఖాయం. అప్పుడు జియో తప్ప ఏ ఐడియా పనిచేయకపోవచ్చు. 


Related Post