ఆ కుర్రాడి వయసు 16 ఏళ్ళు. పేరు హర్షిత్ శర్మ. చండీగఢ్ లోని గవర్నమెంట్ మోడల్ సీనియర్ సెకండరీ స్కూల్లో 12 వ తరగతి చదువుకొంటున్నాడు. కంప్యూటర్స్, గ్రాఫిక్స్ వగైరా రంగాలలో అతను అసాధారణ నైపుణ్యం, ప్రతిభ కనబరుస్తున్నాడు. ఆ సంగతి గూగుల్ సంస్థ చెవిన పడటంతో హర్షిత్ శర్మకు నెలకు రూ.4 లక్షల స్టైఫండ్ చొప్పున ఏడాదిపాటు తమ సంస్థలో గ్రాఫిక్స్ విభాగంలో శిక్షణ ఇవ్వడానికి తీసుకొంది. శిక్షణ పూర్తయిన తరువాత నెలకు రూ.12 లక్షల జీతం ఇవ్వడానికి ఆ కుర్రాడితో ఒప్పందం చేసుకొంది. అంటే హర్షిత్ శర్మ వార్షిక ఆదాయం రూ.1.44 కోట్లు అన్నమాట! అంత చిన్న వయసులోనే అంత పెద్ద సంస్థలో అంత బారీ జీతం అందుకొంటున్న మొదటివ్యక్తి హర్షిత్ శర్మ కావడం విశేషం.