మాజీ కాంగ్రెస్ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రం గౌడ్ కాల్పుల కేసులపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు మొదట కుటుంబ కలహాలే అందుకు కారణం అని అనుమానించినప్పటికీ వారు ఊహించని అనేక కొత్త విషయాలు బయట పడ్డాయి.
విక్రం గౌడ్ కు సుమారు రూ.30 కోట్ల వరకు అప్పులు ఉన్నట్లు తెలిసింది. అప్పులు ఇచ్చినవారు వాటిని తిరిగి చెల్లించాలని అతనిపై చాలా ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. మాదాపూర్ లో ఉన్న ఒక పబ్ లో విక్రం గౌడ్ భాగస్వామి గా ఉన్నారని పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసులపై సిట్ అధికారుల దర్యాప్తు వివరాలను విక్రం గౌడ్ చాలా నిశితంగా గమిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సిట్ విచారణ ఆ కేసులకు సంబంధించిన వివరాలు విక్రం కుమార్ సెల్ ఫోన్ లో పోలీసులకు లభించినట్లు సమాచారం. కనుక తను భాగస్వామిగా ఉన్న పబ్ విషయంలో కూడా అయన ఎందుకో ఆందోళన చెందుతున్నట్లు అర్ధం అవుతోంది.
విక్రం గౌడ్కు సినీపరిశ్రమలో వారితో కూడా చాలా పరిచయాలున్నాయి. ఆసుపత్రిలో ఉన్న ఆయనను సిట్ విచారణను ఎదుర్కొన్న దర్శకుడు పూరీ జగన్నాథ్ పరామర్శించడం విశేషం కలిశారు. విక్రం గౌడ్ ఇదివరకు నితిన్ హీరో గా ఇష్క్, గుండె జారి గల్లంతయిందే అనే రెండు సినిమాలు తీశారు కూడా. వాటిలో ఇష్క్ సూపర్ హిట్ అయ్యింది కానీ రెండవది అంతగా ఆడలేదు. ఆ కారణంగా విక్రం కుమార్ చేసిన అప్పులు తీర్చలేకపోయుండవచ్చు.
ఈ నేపధ్యంలో ఈ ఒత్తిళ్ళు తట్టుకోలేకనే విక్రం గౌడ్ ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విక్రం గౌడ్ ఇంటిలో నేలమీద ఉన్న రక్తాన్ని కొంతమేర ఎవరో తుడిచినట్లు పోలీసులు గుర్తించారు. కనుక ఎవరైనా ఆయనను హత్య చేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించాలనే ఉద్దేశ్యంతోనే సాక్ష్యాలు కనబడకుండా మాయం చేయాలని ప్రయత్నించారా? అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. తన భర్తపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపి పారిపోయినట్లు ఆయన భార్య పోలీసులకు పిర్యాదు చేశారు. ప్రస్తుతం విక్రం గౌడ్ ఆరోగ్య అరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కనుక అయన కోల్కొని స్వయంగా చెపితే ఈ కాల్పులకు ఎవరు కారకులో.. కారణాలు ఏమిటో తెలియవచ్చు.