కేసీఆరే బాబుని హైదరాబాద్ నుంచి సాగనంపారా?

July 28, 2017


img

ఓటుకు నోటు కేసు..దాని తదనంతర పరిణామాల గురించి అందరికీ తెలుసు. మళ్ళీ చాలా రోజుల తరువాత సాక్షాత్ ముఖ్యమంత్రి కేసీఆర్ నోట ఆ ప్రస్తావన రావడం విశేషం. మొన్న ఆయన డిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 

ఆ సందర్భంగా ఒక విలేఖరి “మీరు తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన తరువాత మీ  ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు డిల్లీలో కుట్రలు జరిగాయని వార్తలు నిజమేనా?” అనే ప్రశ్నకు సమాధానంగా “అవును. నిజమే.తెలంగాణాలో రాష్ట్రపతి పాలన విధింపజేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల వరకు అవి సాగుతూనే ఉన్నాయి. వాటిని నేను సమర్ధంగా నిలువరించగలిగాను. అయినా నా ప్రభుత్వాన్ని అస్థిరపరిచడానికి కుట్రలు పన్నుతున్నవారిని నేను ఎందుకు ఉపేక్షిస్తాను? ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి అమరావతి తరలివెళ్ళిపోవడం అందరూ చూశారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో రెండేళ్ళు ఉండి సాధించిందేమీలేదని గ్రహించిన ఏపి సిఎం చంద్రబాబు నాయుడు అమరావతికి తరలిపోయారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నాయి కనుక రెండూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇంకా అభివృద్ధి చెందాలంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాల మద్య సయోధ్య, పరస్పర అవగాన చాల అవసరం,” అని కేసీఆర్ చెప్పారు. 

అంటే తెలంగాణా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు పన్నిన చంద్రబాబును తానే హైదరాబాద్ నుంచి అమరావతికి సాగనంపానని చెప్పినట్లే కదా!


Related Post