పాకిస్తాన్ కు అమెరికా షాక్

July 22, 2017


img

పాకిస్తాన్ కు అమెరికా ఊహించలేని షాక్ ఇచ్చింది. ఉగ్రవాదంపై పోరు కోసం ఏటా ఇస్తున్న $ 50 మిల్లియన్ డాలర్లు (రూ.322 కోట్లు) నిలిపివేస్తున్నట్లు పెంటాగాన్ ప్రకటించింది. అనేక ఏళ్ళుగా పాకిస్తాన్ కు నిధులు అందిస్తున్నప్పటికీ ఉగ్రవాదం నిర్మూలించలేకపోయిందని, పైగా ఉగ్రవాదులకు నిలయంగా మారినట్లు గుర్తించామని అందుకే అమెరికా రక్షణశాఖ ప్రధానకార్యదర్శి జిమ్ మాటిస్ ఆదేశాల మేరకు నిధులు నిలిపివేస్తున్నామని పెంతాగాన్ అధికారులు ప్రకటించారు. అంతకు ముందే పాకిస్తాన్ ను ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశాలలో ఒకటిగా గుర్తిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. 

ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్ళి ఏమి సాధించారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఇదివరకు భారత ప్రధానులు ఎన్నిసార్లు అమెరికా అధ్యక్షులతో మంతనాలు చేసినా వారి మాటలను ఎవరూ పట్టించుకోలేదు. కానీ మోడీ మొట్టమొదటి సమావేశంలోనే పాకిస్తాన్ కు అమెరికా నుంచి నిధుల ప్రవాహాన్ని అడ్డుకట్ట వేయగలిగారు.  ఇదే మోడీ సాధించిన విజయం.

ఇంతకాలం అమెరికా అందిస్తున్న ఆ నిధులతో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు ఇప్పుడు చేతులు కట్టేసినట్లు అవుతుంది. కనుక భారత్ పైకి ఉగ్రవాదులను పంపడం కూడా తగ్గే అవకాశాలున్నాయి. అయితే తమను అమెరికా దూరంగా పెడుతోందని ముందే పసిగట్టిన పాకిస్తాన్, చైనా పంచన చేరింది. చైనాకు కూడా భారత్ ను శత్రువుగానె భావిస్తోంది కనుక ఇప్పుడు అది పాకిస్తాన్ కు నిధులు అందిస్తుందేమో? 


Related Post