శాసనసభ సమావేశాలు బహిష్కరిస్తున్నాం: హరీష్‌ రావు

January 02, 2026


img

బీఆర్ఎస్‌ పార్టీ శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌ రావు ప్రకటించారు. కేసీఆర్‌ని ఉద్దేశ్యించి సిఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు, స్పీకర్ ఏకపక్ష వైఖరికి నిరసనగా శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నామని హరీష్‌ రావు చెప్పారు.

నేడు శాసనసభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోగా కాంగ్రెస్‌ సభ్యులు సభలో బూతులు మాట్లాడుతూ తమని చాలా అవమానించారని హరీష్‌ రావు అన్నారు. అయినా స్పీకర్ వారించకపోగా, సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి తీవ్ర వ్యాఖ్యలు చేయవద్దని తమనే హెచ్చరించారని అన్నారు.

బీఏసీ సమావేశంలో అనుకున్న అజెండా ప్రకారం సభలో చర్చించకుండా తమ ఇష్టారాజ్యంగా సభ నడుపుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అందుకే సభ నుంచి వాకవుట్ చేసి వచ్చేశామన్నారు. సిఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ తీరుకి నిరసనగా శాసనసభ సమావేశాలు బహిష్కరిస్తున్నామని హరీష్‌ రావు ప్రకటించారు. 

శాసనసభ సమావేశాలు మొదలయ్యే ముందు, బీఏసీ సమావేశంలో కనీసం రెండు మూడు వారాలు సభ నడిపించాలని బీఆర్ఎస్‌ పార్టీ నేతలు పట్టుపట్టారు. కానీ రెండో రోజే సభ నుంచి వాకవుట్ చేసి బయటకొచ్చేసి, సమావేశాలను బహిష్కరిస్తున్నామని చెప్పి వెళ్ళిపోయారు.

శాసనసభ సమావేశాలకు ముందు ఫామ్‌హౌసులో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ భేటీ అయ్యి సభలో ఏవిధంగా వ్యవహరించాలో దిశానిర్దేశం చేశారని చెప్పుకుంటారు. అది ఇలాగేనా?


Related Post