సినీ తారల డ్రెస్సింగ్ గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలతో ఈ అంశంపై ఇంకా వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే సినిమా రివ్యూల విషయంలో చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది.
తాజాగా హైదరాబాద్‌లో జరిగిన “స్టాండ్ ఫర్ అవర్ ఈషా... సేవ్ స్మాల్ ఫిల్మ్స్” అనే కార్యక్రమంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మరో కొత్త విషయం బయటపెట్టారు.
ఈషా సినిమా అమెరికాలో రిలీజ్ చేయక ముందే దానిపై ఒక పెద్ద మనిషి రివ్యూ వ్రారు. తాను ఆయనకి ఫోన్ చేసి అడిగితే ఆయన సమాధానం విని షాక్ అయ్యానని చెప్పారు.
“ఆయన ‘ఈషా’ చూడలేదని, హైదరాబాద్‌లో ఆయనకు తెలిసినవారెవరో సినిమా చూసి చెపితే రివ్యూ వ్రాశానని చెప్పారు. ఇలా సినిమా చూడకుండానే రివ్యూలు వ్రాయడం... సినిమాని విడుదల కాకముందే దెబ్బ తీయాలనుకోవడం తప్పు కదా?” అని వంశీ ప్రశ్నించారు.
దర్శకుడు శ్రీనివాస్ మన్నె మాట్లాడుతూ, “సినిమాలపై రివ్యూల ద్వారా మాకు కొన్ని మంచి సలహాలు లభిస్తుంటాయి. మా సినిమాలలో ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు, పొరపాట్లు జరిగాయో మేము రివ్యూల ద్వారా తెలుసుకోగలుగుతాము. కానీ సినిమాని ఎలాగైనా చంపేయాలనే దురుదేశ్యంతో నెగెటివ్ ప్రచారం చేస్తూ రివ్యూలు వ్రాయడం సబబు కాదు.
కొన్ని వెబ్‌సైట్ల రివ్యూలలో పచ్చి బూతులు కూడా వ్రాస్తున్నారు. మనమందరం మనుషులం. సమాజంలో కలిసి మెలిసి జీవిస్తున్నాము. సమాజంలో ఎవరి స్పేస్ వారికుంది. దానిని పరస్పరం గౌరవించుకోవాలి. అడవులలో మృగాలు బతకడం కోసం ఒక దానిని మరొకటి చంపుకొని తింటాయి. మనం కూడా వాటిలా ఎందుకు ప్రవర్తిస్తున్నాము?
ఒకవేళ సినిమా బాగోకపోతే రివ్యూలు ఎలా ఉంటాయో మాకు బాగా తెలుసు. సినిమా బాగోకపోతే ప్రేక్షకులే తిరస్కరిస్తారని మాకు తెలుసు. కనుక అందరినీ మెప్పించేలా సినిమా తీయాలనే మేమందరం ప్రయత్నిస్తుంటాము. కనుక ఎంతో మంది రేయింబవళ్ళు కష్టపడి తీసిన సినిమాని ప్రేక్షకులు చూడనీయండి. వారినే సినిమా బాగుందో లేదో నిర్ణయించుకోనివ్వండి.
ఇలాగే సినిమాలను దెబ్బ తీస్తుంటే చివరికి ఇండస్ట్రీలో ఎవరూ మిగలరు. కనుక ఇటువంటి రాతలకు ఎక్కడో అక్కడ అడ్డుకట్ట వేయక తప్పదు. ఇందుకు మీడియా మిత్రులందరూ పూనుకోవాలి, అని దర్శకుడు శ్రీనివాస్ మన్నె విజ్ఞప్తి చేశారు.
ఓ సినిమాని తీయడానికే చాలా కష్టపడాల్సి ఉంటుంది. తర్వాత సినిమాని రిలీజ్ చేసుకోవడానికి మరో పోరాటం తప్పదు. రిలీజ్ చేసుకున్న తర్వాత కూడా దర్శక నిర్మాతలు ఇలాంటి పోరాటాలు చేయాల్సి రావడం ఎంత బాధాకరమో!
ఈ మూవీ అమెరికాలో ఇంకా రిలీజ్ కాలేదు.
— idlebrain.com (@idlebraindotcom) December 25, 2025
అలాంటప్పుడు మీరు ఎలా రివ్యూ రాశారు అని అడిగితే, ఆయన ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది చూసి చెప్పారు అని అన్నారు.
అంటే, ఒక అన్ఫినిష్డ్ ప్రోడక్ట్‌ను చూసి ఒక కామెంట్ ఇస్తే ఆయన రివ్యూ రాశారు
- Vamsi Nandipati
Stand for #Eesha pic.twitter.com/z9OigsFfa5