కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. కరీంనగర్ స్వశక్తి కళాశాలలో ఈరోజు ఈ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా హాజరవడం విశేషం.
ఇది ఆయన నియోజకవర్గంలో జరుగుతోంది కనుక ఎమ్మెల్యేగా హాజరవడం తప్పు కాదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతీ పనిని విమర్శించే బీఆర్ఎస్ పార్టీకి చెందిన గంగుల ఈ కాంగ్రెస్ కార్యక్రమంలో హాజరవడంతో ఊహాగానాలు మొదలైపోయాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీ నేతలు కాంగ్రెస్, బీజేపి లేదా తెలంగాణ జాగృతివైపు వెళ్ళే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నానని గంగుల కమలాకర్ సంకేతం పంపించి ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కానీ ఈ సభలో అయన ప్రసంగిస్తూ, “నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో నిరుపే మహిళలకు బతుకమ్మ చీరలు ఇచ్చి ఓ మంచి సాంప్రదాయం నెలకొల్పారని, ఆ పధకం పేరు మార్చినా దానిని కాంగ్రెస్ పార్టీ కూడా ఈవిదంగా కొనసాగిస్తుండటం తనకు చాలా ఆనందం కలిగిస్తోందని అన్నారు.