భారత్‌ని షేక్ చేస్తున్న హసీనా!

November 18, 2025


img

గత ఏడాది బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు జరిగినప్పుడు ప్రధాని షేక్ హసీనా తప్పించుకొని భారత్‌ చేరుకొని, అప్పటి నుంచి రాజకీయ ఆశ్రయంలో ఉన్నారు. ఆమెను తమకి తిరిగి అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌ని పలుమార్లు కోరింది. కానీ భారత్‌ సున్నితంగా తిరస్కరిస్తూనే ఉంది. తాజాగా బంగ్లాదేశ్ అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఆమెకు మరణ శిక్ష విధించింది. కనుక ఆమెను తక్షణమే తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌ని కోరింది. 

ఆమె ప్రధానిగా ఉన్నప్పుడు భారత్‌తో చాలా సఖ్యతగా ఉన్నారు. భారత్‌- బంగ్లాదేశ్ దౌత్య, స్నేహ సంబంధాలు మెరుగుపడేందుకు చాలా కృషి చేశారు. భారత్‌ పట్ల ఇంత స్నేహంగా ఉండే ఆమెను అప్పగించేస్తే బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే ఆమెకు మరణ శిక్ష విధించడం తధ్యం. కనుక భారత్‌ మరోసారి సున్నితంగా తిరస్కరించింది. దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం, కొందరు రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. 

ఒకవేళ ఇతర దేశాల చేత భారత్‌పై ఒత్తిడి చేస్తే అప్పుడూ ఆమెని భారత్‌ ప్రభుత్వం కాపాడుతుందా లేదా?అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ఆమెకి రాజకీయ ఆశ్రయం కల్పించి భారత్‌ ఇప్పుడు చిక్కులో పడిందనిపిస్తుంది.


Related Post