బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రెటీలపై పోలీసులు కేసు నమోదు చేసి ఒక్కకరినీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని వాటితో జీవితాలు నాశనం చేసుకోవద్దని సోషల్ మీడియా ద్వారా పదేపదే విజ్ఞప్తి చేస్తూనే ఉంటారు.
తెలంగాణ పోలీస్ శాఖ కూడా పదేపదే విజ్ఞప్తి చేస్తూనే ఉంటుంది. కానీ తెలంగాణ పోలీస్ శాఖలోనే కొందరు పోలీసులు బెట్టింగ్ యాప్‌లతో జీవితాలు నాశనం చేసుకుంటుండటం చాలా బాధాకరం.
వారం రోజుల క్రితమే ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా చేస్తున్న డి. శ్రీకాంత్ (42) ఆత్మహత్య చేసుకున్నారు. అయన బెట్టింగ్ యాప్‌లలో డబ్బు కోల్పోయి ఆర్ధిక సమస్యలలో కూరుకుపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
రహమత్ నగర్‌కు చెందిన రమేష్ అనే పోలీస్ కానిస్టేబుల్ గత కొన్ని రోజులుగా పోలీస్ స్టేషన్‌కి, ఇంటికీ రావడం లేదు. అయన భార్య పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆయన కోసం గాలిస్తున్నట్లు సమాచారం. అయన కూడా బ్యాంకు నుంచి అప్పు తీసుకొని మరీ బెట్టింగ్ యాప్‌లో డబ్బు పెట్టి అంతా పోగొట్టుకోవడంతో తీవ్ర ఆర్ధిక సమస్యలలో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. రమేష్ 2018లో ౧వ బెటాలియన్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు.